అడ్డగూడూరు నూతన ఎస్సై పదవి బాధ్యతలు చేపట్టిన కె వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 30 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా కె వెంకట్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.మండలం నుండి బదిలీపై వెళ్లిన డి నాగరాజు హైదరాబాద్ అమీర్ పేట్ పిఎస్ కు బదిలీపై వెళ్లగా హైదరాబాద్ సి సి ఆర్ సి బదిలీపై శుక్రవారం రోజు అడ్డగూడూరు మండలంలో పదవి బాధ్యతలు చేపట్టారు.ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలంతా విధులకు ఆటంకం కలగకుండా పోలీస్ వారితో సహకరించాలని ప్రత్యేకంగా కోరారు.