ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్లకు గురుకుల పాఠశాలల మరియు కస్తూర్బాయ్ గాంధీ పాఠశాలల వారికి అవగాహన కార్యక్రమం.
జోగులాంబ గద్వాల15 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్లకు, గురుకుల పాఠశాలలు మరియు కస్తూర్బా గాంధీ పాఠశాల,APAAR ID GENERATION అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది. కార్యక్రమం నందు ఇటిక్యాల మండల విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర మరియు ఎర్రవల్లి మండల విద్యాశాఖ అధికారి అమీర్ పాష , పాఠశాల వారీగా విద్యార్థుల APAAR ఐడి క్రియేట్ చేసిన విధానాన్ని అడిగి తెలుసుకుని అపార్ ఐడి క్రియేట్ చేయడంలో ప్రైవేట్ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయని, కచ్చితంగా ప్రతి విద్యార్థికి APPAR ID క్రియేట్ చేయాలని ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉన్నట్లయితే మండల వనరుల కేంద్రంలోని స్టాఫ్ తో నిర్వర్తి చేసుకొని 100% పూర్తి చేయాలని ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని, గురుకుల, కేజీబీవీ ప్రిన్సిపాల్ వారు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు MEO OFFICE సిబ్బంది కాజా ఎంఐఎస్ కోఆర్డినేటర్ , హనుమంతు డాట్ ఎంట్రీ ఆపరేటర్, రాణమ్మ ,మద్దిలేటి, శ్రీనివాసులు, సిఆర్పిలు పాల్గొన్నారు...