తెలంగాణలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు

Dec 11, 2025 - 18:43
 0  7
తెలంగాణలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్:డిసెంబర్ 11 : తెలంగాణలో తొలి విడుద పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది ఒంటిగంటలోపు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు..  తెలంగాణలో 3,834 సర్పంచ్,27,628, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం  ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత వార్డు సభ్యులతో సమావేశా నిర్వహించి ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయితే అక్క డక్కడా కొన్ని గొడవలు జరిగాయి. కానీ పోలింగ్ ప్రశాంతగా ముగిసింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333