ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవలు నిషేధం జిల్లా ఎస్పీ: టి. శ్రీనివాసరావు, ఐపీఎస్
▪ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు, పూర్తిగా నిషేధం
▪నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్పీ.
జోగులాంబ గద్వాల 11 డిసెంబర్ 25 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోనే కొనసాగుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్,* స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ....ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఇప్పుడే విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. MCC అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించం. ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
.....