తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వెంకటనరయ్య ఘననివాలి

Jul 3, 2024 - 19:34
Jul 3, 2024 - 21:56
 0  8
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వెంకటనరయ్య ఘననివాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  అలుగుబెల్లి వెంకట నర్సయ్య త్యాగాలు గొప్పవి తెలంగాణ సాయుధ రైతంగా పోరాట యోధులు, రైతుకూలీ సంఘ వ్యవస్థాపక సభ్యులు, సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య 2 వ వర్ధంతి సందర్భంగా తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య , ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ అలుగుబెల్లి  హైదరాబాద్ సంస్థానంలో నైజాం నిరంకుషత్వ పాలనకు,దొరల భూస్వాముల వెట్టి చాకిరి, శిస్తులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి లక్ష్యంగా జరిగినటువంటి పోరాటంలో సూర్యాపేట ప్రాంతంలో నాయకత్వం వహించి అనేక అనేక పేద ప్రజలకు భూములు పంచిపెట్టిన చరిత్ర అలుగుబెల్లి గారికి ఉన్నదని కొనియాడారు. రజా కార్, యూనియన్ సైన్యాల, స్థానిక పెత్తందారుల, గుండాల దాడులన్నిటిని ఈ ప్రాంతంలో ఎదుర్కొని పోరాట యోధుడిగా నిలిచాడని అన్నారు. 1967 నక్సల్ బరి పిలుపుతో విప్లవ కమ్యూనిస్టుగా నాటి ప్రభుత్వం పై పిడికిలెత్తి, అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ, అనేక పోలీసు నిర్బంధాలను, అక్రమ కేసులను ఎదుర్కొని సంవత్సరాలు తరబడి జైల్లో బంధించబడ్డారని అన్నారు.

అడవి ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధమును ఎదిరిస్తూ , ఆ కాలంలో కరీంనగర్ ప్రాంతానికి వెళ్లి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చారు. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ సర్పంచ్ కి రాజీనామా చేయాలంటే రాజీనామా చేసి పూర్తి కాలపు కార్యకర్తగా ఈ వ్యవస్థ మార్పు కోసం తన చివరి శ్వాస వదిలే వరకు పోరాడి అమరత్వం చెందారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సక్క, ఏఐకేఎంఎస్ డివిజన్ కమిటీ సభ్యులు వీర్య నాయక్, గ్రామ నాయకులు పిట్టల లింగయ్య, వడ్లకొండ నాగయ్య, పిడమర్తి ఎల్లయ్య, సంఘం వీరయ్య, అలుగుబెల్లి వాణీ, కొరివి మంగమ్మ, పిడమర్తి లక్ష్మి, పిడమర్తి వెంకటమ్మ, పెడమర్తి ఉప్పయ్య, పెడమర్తి లింగయ్య,పిడమర్తి నరసయ్య, బోల్క గణేష్ తదితరులు పాల్గొన్నారు. నాగయ్య పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు