తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి జయశంకర్ సార్

Jun 21, 2025 - 20:33
 0  8
తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి జయశంకర్ సార్

 తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర  మరువలేనిది. 

  సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షులు, పంతంగి వీరస్వామి గౌడ్.

 (సూర్యాపేట టౌన్  జూన్ 21) :  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ సార్ అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన రియల్ ఎస్టేట్  జిల్లా కార్యాలయంలో హాజరై ఆచార్య కొత్త పెళ్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో నలుగుతున్న తెలంగాణ దుస్థితిని తన రచనల ద్వారా తెలంగాణ ప్రజలకు అందించిన చరిత్రకారుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో దగా పడుతున్న తెలంగాణ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించిన ఉద్యమకారుడు అని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ వంటి తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించి రాజకీయాలకు అతీతంగా అందరిని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహా నాయకుడు అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి,అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333