కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి

Aug 11, 2026 - 16:03
Aug 11, 2026 - 16:15
 0  10

జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State