తెలంగాణ మలిదశ ఉద్యమకారుడా కదలిరా...
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం.
తుంగతుర్తి నియోజకవర్గం మలిదశ ఉద్యమకారులారా కదలిరండి
ఈనెల 27వ తేదీన తిరుమలగిరిలో మలిదశ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు
తిరుమలగిరి 24 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని గడిలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు గురువారం సమావేశం అయ్యారు.ఉద్యమ సమయంలో పడిన కష్ట నష్టాలు చర్చించుకుని ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకునేందుకు భార్యబిడ్డలు కుటుంబాలను వదిలి ఎన్నో కేసులలో ఇరుక్కొని ఆర్థికంగా నష్టపోయి తెలంగాణ సాధించుకుంటే తమ పిల్లల భవిష్యత్తు,తమ భవిష్యత్తు బంగారమవుతుందని ఆశతో ఎంతో కష్టనష్టాలకు వచ్చినా ఉద్యమకారులుగా పోరాడితే నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎవరు లేని అనాధగా మిగిలిపోయారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కూడా ఉద్యోగాలు లేవు.దీంతో ఉపాధి కరువై కుటుంబ పోషణ కోసం రోడ్డు పడుతున్న పట్టించుకునే ప్రభుత్వాలే లేక పోయేనని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు దెబ్బలకు తట్టుకొని,కేసులు జైలు పాలై.. జీవితాలను త్యాగాలు చేస్తే భోగాలు ఎవరు అనుభవిస్తున్నారని ప్రశ్నించారు. ఆనాటి ఉద్యమ సమయంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఆట మాట పాటలతో సబ్బండ వర్గాలను ఏకం చేసి అహర్నిశలు కొట్లాడితే ఇవాళ తెలంగాణ ఎవరు పాలైందని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల ఆదివారం 27న తిరుమలగిరిలో నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ,కోతి మాధవి ఉద్యమకారులు పేరాల యాదగిరి,బైరెడ్డి ఏసిరెడ్డి,ఎండి రెహ్మాన్ అలీ వేల్పుల నర్సయ్య,పాక సోమయ్య,రాంకుమార్,కొత్తగట్టు యాకయ్య,గడ్డం ఉదయ్,కళాశ్రీ ప్రవీణ్,మొల్గురి రామక్రిష్ణ,కొండ మహేష్,గోడిశాల శ్రీను,గఫార్ ఖాన్,వీరనారి,ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.