ఎన్నికల కోడ్ తో ఫ్లెక్సీల తొలగింపు
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్
తిరుమలగిరి లో అధికారులు అలర్ట్
తిరుమలగిరి 28 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ రావడంతో తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ లో అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానిక మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రావు మరియు శోభారాణి రంగంలోకి దిగి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రచారాల ఫ్లెక్సీలతో పాటు వాల్ రైటింగ్, వాల్ పోస్టర్లను మున్సిపల్ సిబ్బందితో కలిసి తొలగించారు. అంబేద్కర్ నగర్, తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్, బిజెపి సీపీఎం, బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన వాటన్నింటినీ తొలగించారు. అంతేకాకుండా మున్సిపల్ పరిధిలో ఉన్న మాలిపురం అనంతరం నందపురం ఈదులపర్రె తండా నీలి బండ తండా లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రినంత తొలగించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి ప్రచారాలు నిర్వహించవద్దని వారు ఆదేశించారు.