లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం సద్వినియోగం చేసుకోండి

Oct 25, 2025 - 12:39
 0  128
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం సద్వినియోగం చేసుకోండి

తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్ లో 28 అక్టోబర్ 2025 మంగళవారం రోజున మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు   అర్శమొలలు, ఫిస్టులా, హెర్నియా, కణుతులు, రొమ్ము గడ్డలు, మూత్రపిండాలలో రాళ్లు , అపెండిక్స్ నొప్పి  ఎముకల & కీళ్ళ వైద్య విభాగం మోకాళ్లు, కీళ్లు, నడుము, మెడ, వెన్నెముక నొప్పులు తలనొప్పి , పార్శ్వ నొప్పి , పక్షవాతం , ఫిట్స్, మూర్ఛ , తొంటినొప్పి, కాళ్ళు, చేతుల మంటలు దగ్గు, దమ్ము, ఆయాసము, ఊపిరి తిత్తుల నిమ్ము, అన్నిరకాల జ్వరాలు, బీపి, షుగర్ చిన్న పిల్లలకు సంభందించిన అన్నిరకాల పరీక్షలు మరియు ఉచితంగా మందులు దీర్ఘకాలిక సమస్యలకు చూస్తారని ఇట్టి ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి