జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్.

Jun 20, 2024 - 18:24
Jun 20, 2024 - 19:04
 0  23
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్.
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్.

జోగులాంబ గద్వాల 20 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని తేదీ.20 .6.2024 న   జిల్లా పరిషత్ చైర్మన్  ఎస్. సరిత తిరుపతయ్య , గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు, స్కూల్ పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్ వేసి *జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం-2024 * ప్రారంభించారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ.... జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం లో భాగంగా ఈరోజు 20.06.2024 న జిల్లా వ్యాప్తంగా  ప్రతి అంగన్వాడి స్కూలు, మరియు ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు మరియు ప్రభుత్వ ,ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్నాము తెలిపారు.., మరియు మన జోగులాంబ గద్వాల జిల్లాలో 1,52,731 , మంది 1 - 19 సంవత్సరాలకు విద్యార్థులు ఉన్నారని వీరందరికీ ఈరోజు ఆల్బెండజోల్ టాబ్లెట్ వేస్తున్నామని తెలిపారు..

1 - 2 సంవత్సరాలలోపు పిల్లలకు 1/2 ఆల్బెండజోల్  టాబ్లెట్ పొడిచేసి నీటిలో కలిపి త్రాగాలని విద్యార్థులకు సూచించారు...

2 - 19 సంవత్సరంలోపు పిల్లలకు ఒక టాబ్లెట్ ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి నమిలి మింగమని విద్యార్థులకు  తెలియజేశారు..

తదనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్  ఎస్. శశికళ  మాట్లాడుతూ,ఆల్బెండజోళ్  టాబ్లెట్స్ ను మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వేసుకోవాలని , విద్యార్థులకు సూచించాలని తెలిపారు.. 20.6.2024 న ఏదైనా అనివార్య కారణాలవల్ల ఆల్బెండజోల్ మాత్ర వేసుకునకపోతే, మిగిలిన విద్యార్థులకు  27.6.2024 తేదీన Mop Up  రౌండ్ లో వేస్తారని తెలిపారు..

సాధారణంగా పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ అనేది చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం, ఆరుబయట వట్టికాళ్లతో ఆడుకొనుట, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాల వల్ల, నీరు మరియు ఆహారం కలుషితం కావడం వల్ల పిల్లల్లో నులిపురుగుల సంక్రమణ జరుగుతుంది..
ఈ నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకారలోపము, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారము, వీరేచనాలు, బరువు తగ్గడం ,ఆందోళన మొదలగు లక్షణాలు కనిపించవచ్చు..

ఈ నులిపురుగుల సంక్రమణ అనేది విద్యార్థులలో కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా, విద్యార్థులు వారంనకు ఒకసారి గోర్లు కత్తిరించుకోవడం, ఆరుబయట ఆడుకునేటప్పుడు మరియు స్కూలుకు వెళ్లేటప్పుడు బూట్లు, లేదా చెప్పులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా ఉండటం ,వ్యక్తిగత మరుగుదొడ్డిని వాడటం, భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, పండ్లు కాయగూరలను శుభ్రమైన నీటితో కడుక్కోవడం, ఆహారంపై మూతలు ఉంచటం, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగడం ,పరిశుద్ధ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వల్ల ఈ నులిపురుగుల సంక్రమణ నుంచి దూరంగా ఉండవచ్చని విద్యార్థులకు   తెలిపారు..

ఈ  కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సభ్యులు మరియు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప , జిల్లా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్   సుధారాణి, ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఇమ్మానియేల్, స్కూల్ టీచర్లు , అంగన్వాడి టీచర్లు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది డాక్టర్ రాజశేఖర గౌడ్, కే మధుసూదన్ రెడ్డి, వరలక్ష్మి, రామకృష్ణుడు, నరేంద్రబాబు, శివన్న, శ్యాంసుందర్, లక్ష్మీదేవి , పార్వతమ్మ, సుజాత, హనుమంతు , , ఆశాలు పాల్గొన్నారు...

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State