తిరుమలగిరిలో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి
తిరుమలగిరి 22 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు మందుల సామెల్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు భవిష్యత్తులో టెక్నాలజీ అవసరమని ముందే గ్రహించి టెలిఫోన్ ఐటి రంగానికి పునాదులు వేసిన దూరదృష్టి గల వ్యక్తి అని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా కొనసాగిన కాలంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపుందాలని ప్రపంచ శాంతి కోసం ఎల్లప్పుడు తపించేవారని ఆ ప్రయత్నంలోనే ఎల్టిటి అనే ఉగ్రవాదుల మానవ బాంబు దాడిలో హత్యకు గురై దేశం కోసం ప్రాణం త్యాగాలు చేసిన త్యాగ మూర్తి రాజీవ్ గాంధీ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్ మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు మాజీ మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్ మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర యాదగిరి కందుకూరు లక్ష్మయ్య వంగాల దానయ్య దాచే పల్లి వెంకన్న మండల సేవాదళ్ అధ్యక్షులు దండుగుల యాదగిరి కోపరేటివ్ డైరెక్టర్ కిస్టు నాయక్ పానుగంటి గణేష్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయని కృష్ణ నాగరాజు దుపాటి అశోక్ బానోత్ భాస్కర్ మున్సిపల్ కౌన్సిలర్లు గిలకత్తుల ప్రియాలత రామ్ గౌడ్ కుదురుపాక శ్రీలత పత్తేపురం సరిత కన్నెబోయిన రేణుక పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకాయల సుధాకర్ గడ్డి దిలీప్ బోన్ల వంశీ మాసంపల్లి మోహన్ యువజన కాంగ్రెస్ నాయకులు ఎల్సొజు నవీన్ నాగేంద్ర చారి కంబాల రాకేష్ కొల్లోజు కళ్యాణ్ మహమ్మద్ రఫీ రషీద్ తరుణ్ బేతు విజయ్ తదితరులు పాల్గొన్నారు