తిరుమలగిరి మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు

Jul 28, 2026 - 22:01
 0  1
తిరుమలగిరి మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు

  తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరు. 

స్థల పరిశీలన చేసిన అధికారులు.

తిరుమలగిరి 29 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయుటకు నివేదికలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు మారిన మా నియోజకవర్గంలో మోత్కూర్ లో తప్ప ఫైర్ స్టేషన్ నియోజకవర్గం లో ఎక్కడా లేకపోవడం తో మా ప్రాంతంలో ఎక్కడ ప్రమాదాలు జరిగిన నలభై కిలోమీటర్లు దూరంలో సూర్యాపేట ఫైర్ స్టేషన్ తదుపరి మోత్కూర్ లో ఉండడంతో గంటల తరబడి రావడానికి పట్టడంతో మా నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా పెద్ద ప్రమాదం జరిగిన ఆ వాహనం వచ్చేవరకు అంతా బూడిద గా మారుతున్నాయని మా నియోజకవర్గంలోని ప్రజలు రైతులు ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఫైర్ స్టేషన్ మంజూరు చేయకపోవడంతో మా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో చాలా ఇబ్బందులతో రైతులు మరియు కొన్ని ప్రైవేటు కంపెనీలు పూరి గుడిసెలు గడ్డివాములు చాలా వరకు నష్టపరిహారం జరిగిందని గత 15 సంవత్సరాల క్రితం మొరపెట్టుకున్న మా నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ మంజూరు కాలేదని పలు మండలాల రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ మంజూరు లెటర్ రావడంతో తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మేము రాతపూర్వకంగా ఆర్జీలు పెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో భారీ నష్టం వాటిలిందని పలు మండలాల రైతులు పారిశ్రామికవేత్తలు పలు సంఘాల నాయకుల కృషితో ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో స్థల పరిశీలన చేయడానికి కొన్ని ప్రాంతాలను పరిశీలించి అనువైన ప్రాంతాన్ని చూస్తూ ఆ జాగాలో ఫైర్ స్టేషన్ నిర్మాణం చేయుటకు సర్వేనెంబర్. 381 సర్వేనెంబర్ భూమి పక్కనే ప్రభుత్వ హాస్పిటల్ భవనం కూడా నిర్మించారు ఈ భూమి అనువైనదిగా అగ్నిమాపక అధికారి జానయ్య తో పాటు పలువురు మండల అధికారులు అక్కడ ఉన్న భూమిని పరిశీలించి ఇక్కడనే స్థలం బాగుంటుంది అని నిర్ధారణ చేశారు. ఈ మండలంలో గత కొన్ని నెలల నుండి తిరుమలగిరి బస్టాండ్ అభివృద్ధి కమిటీ సభ్యులు మన మున్సిపాలిటీ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము మా వంతు కృషి చేయుటకు అహర్నిశలు కష్టపడి మా తిరుమలగిరిని బాగు చేసుకుంటామని శబదంతో ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఫైర్ స్టేషన్ సాధించిన ఘనత మాకే దక్కిందన్నారు. దీనికి సహకరించిన నాయకులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరిచిన పట్టణ ప్రజలు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి