అభివృద్ధి కోసం వచ్చిన అభివృద్ధి చేసే తీరుతా

Jul 28, 2026 - 21:58
 0  2
అభివృద్ధి కోసం వచ్చిన అభివృద్ధి చేసే తీరుతా

  ఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా...

వంగూరి ఫౌండేషన్ ద్వారా అనేక సహాయాలు......

అభివృద్ధి కోసం వచ్చిన అభివృద్ధి చేసే తీరుతా  ...

విద్యకు మొదటి ప్రాధాన్యత... 

నన్ను కన్న నా ఊరుకు వందేళ్లు గుర్తుండేలా పని చేస్తా...

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న....................

పదేళ్లు నేనే సర్పంచిని...

 

 నాగారం 29 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లానాగారం మండలం ఈటూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని స్థానిక సర్పంచ్ వంగూరి దామోదర్ అన్నారు. మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వంగరి సంస్థను 2018లో ప్రారంభించి అనేక పేద కుటుంబాలకు ఆదుకున్నామని అన్నారు. కరోనా టైం లో ప్రాణాలు లెక్క చేయకుండా నిరుపేదలకు నిత్యవసర సరుకులు, విద్యార్థులకు డ్రెస్సులు, బ్యాగులు, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. వంగూరిఫౌండేషన్ ద్వారా గ్రామంలో బతుకమ్మ పండుగ, బోనాలు, ఆలయాలు నిర్మాణం, విద్యార్థులకు కావలసిన సామాగ్రిని, గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా అందజేశామని అన్నారు. గత పాలకుల వల్లఈటూరు గ్రామంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అందుకే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. గ్రామo లో ప్రజలు సమస్యలు తెలిపారు. గ్రామానికి ఉన్న విద్య, మంచినీటి సమస్య , మురికి కాలువలు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ తదితర సమస్యలుతెలిపారు . నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించారు. మాట ప్రకారమే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు లింకు రోడ్లునిర్మాణ పనులు చేపట్టమని, మురికి కాలువల డ్రైనేజీనిర్మాణం పనులు చేపట్టామని, వంటి ఒక్కొక్కటిగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో చదవడానికి పోరుగురు నుంచి ఈటూరు గ్రామానికి పాఠశాలకు రావడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వెంటనే స్పందించి విద్యార్థులకు చదవడానికి ఆటో సౌకర్యం కల్పించామని అన్నారు. గ్రామంలో ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మీద యువత వాటి జోలి పోకుండా అవగాహన కల్పించి మంచి మార్గంలో నడి పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామంలో పాఠశాల 220 విద్యార్థులకు సొంత నిధులతో స్కూలు యూనిఫాము పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి రాకపోకులకు రోడ్లు ,అద్వానంగా మారాయని , అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణo, అంగన్వాడి భవనం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకుచెప్పడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామంలోని నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఈటూరు గ్రామాన్ని తీర్చి దిద్దడానికి మళ్లీ సర్పంచే ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా నిలబడతానని అన్నారు. ఏటూరు గ్రామాన్ని రాజకీయాల పార్టీల అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఆదర్శవంతంగా తీర్చు దిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి