తల్లిపాలే శ్రీరామరక్ష 12వ వార్డు కౌన్సిలర్ కందుకూరి గీత బాబు
తిరుమలగిరి 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో 'తల్లిపాల మహోత్సవ' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల అన్నప్రాశన కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కందుకూరి గీత బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు శాస్త్రోక్తంగా అన్నప్రాశన చేయించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష అని కౌన్సిలర్ పేర్కొన్నారు. నవజాత శిశువులకు తల్లిపాలు అందించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలని ఆమె సూచించారు.ఈ వేడుకలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ జాకియా, అంగన్వాడీ టీచర్ ప్రభుల రాణితో పాటు వార్డు ప్రజలు, స్థానిక నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.