విద్యార్థులకు నిర్ణీత సమయంలో యూనిఫామ్ లు అందించాలి
తిరుమలగిరి 06 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
వెలిశాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను అందించేందుకు చేపట్టిన స్కూల్ యూనిఫాం కుట్టు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి కుంభం మంజుల సతీష్ గౌడ్ పరిశీలించారు
కుట్టు పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రతి విద్యార్థికి సరైన కొలతలతో యూనిఫాం అందేలా అవసరమైన సూచనలు చేశారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏపీఎం లక్ష్మీ , వివో సరస్వతి , మహిళా కుట్టు కార్మికులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు