కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఇష్ట రాజ్యాలు ఉండవు....కొప్పుల జైపాల్ రెడ్డి
గ్రామ శాఖ మార్పులు ఇప్పట్లో లేవు..
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సూచనతో మండల పార్టీ నడుస్తుంది..
మునగాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మునగాల మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల విషయంలో కొంతమంది కార్యకర్తలను ప్రోత్సహించి నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని మండల పార్టీ దృష్టికి రావడంతో పార్టీ క్యాడర్ లో గందరగోళం జరుగుతుందని ఇలాంటి విషయాలను మండల పార్టీ ఖండిస్తుందని తమకు తెలవకుండా ఇష్టారాజ్యంగా గ్రామ శాఖలు ఎన్నుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు. అలాగే రేపాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా వరికెల రమేష్ కి పూర్తి బాధ్యతలు మండల పార్టీ సూచించిందని ఎవరైనా మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.