తరాలు మారిన మారని సాంప్రదాయం

Jun 1, 2025 - 19:40
 0  11
తరాలు మారిన మారని సాంప్రదాయం

.. ప్రతివారం ఒక వాల్మీకి పూజారికి అర్చకత్వం.

జోగులాంబ గద్వాల 1 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ తరతరాలుగా స్వామివారి కైంకర్యంలో నిమగ్నమై వారం రోజులపాటు నియమనిష్టలతో స్వామివారికి సేవ చేసే భాగ్యం వాల్మీకి పూజారులకు నిలయమైంది. నడిగడ్డలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఆదివారం నుండి శనివారం వరకు నియమనిష్టలతో వాల్మీకి పూజారులు స్వామివారికి ఉదయం సాయంత్రం పూజలు మంగళహారతులు నిర్వహిస్తూ భక్తి ప్రపతులను చాటుతున్నారు. దేవాలయ ఆవిర్భావం నుండి వాల్మీకి పూజారులు వారానికి ఒకరు వంతుల వారీగా మారుతూ వచ్చే ఆచారాన్ని కొనసాగిస్తూ స్వామివారి మహిమలు చాటుతున్నారు. శనివారం స్వామి వారి వారం.. శనివారం వచ్చిందంటే మల్దకల్ లో కోలాహలంగా ఉంటుంది. శ్రీ స్వామివారి దేవాలయ పరిసరాలు దాసంగాలు చేయు భక్తులతో నిండిపోతుంది. ఇందులో భాగంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు హైదరాబాద్ కు చెందిన ఎల్కే రమేష్ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానం చేశారు. అనంతరo రాత్రి దేవాలయంలో ఆరు జంటలు స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి గోవింద నామస్మరణతో దేవాలయం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333