**వ్యసనాలకు దూరంగా ఉండాలి భావితరాలను కాపాడుదాం""సీఐ నరసింహారావు మద్దిరాల పిఎస్*
తెలంగాణ వార్తా ప్రతినిధి మద్దిరాల : వ్యసనాలకు దూరంగా ఉండాలి.
డ్రగ్స్ నుండి మన భావితరాలకు కాపాడుకుందాం..
....CI నరసింహరావు.
డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మద్దిరాల పోలీస్ స్టేషన్ పరిధి మద్దిరాల గ్రామంలో సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తుంగతుర్తి సర్కిల్ సీఐ నరసింహ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గార్ల ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాలలో యువతను గంజాయి లాంటి డ్రగ్స్ బారి నుండి కావాల్సింది కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మన గ్రామాన్ని గంజాయి రహిత డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని గ్రామ ప్రజలకు కోరారు. దీని బారిన పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని తెలిపారు చెడు అలవాట్లకు లోనవుతున్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని సక్రమ మార్గంలోకి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమం నందు స్థానిక ఎస్సై వీరన్న, టీచర్ ప్రభాకర్, గ్రామస్తులు పోలీస్ సిబ్బంది ఉన్నారు