గ్రామీణ ప్రజల తిరుగుబాటు. ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత

Jun 23, 2025 - 21:02
 0  4
గ్రామీణ ప్రజల తిరుగుబాటు.  ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ గ్రామీణ ప్రజల తిరుగుబాటు... మండల వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత, సుదూర పట్టణ ప్రాంతాల నుండి 30, 40 కిలోమీటర్లు దూరం పిల్లలను స్కూల్ బస్సులో , అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాల కు తీసుకెళ్లడాన్ని , తల్లిదండ్రు గ్రామ గ్రామాన నిలువరిస్తున్నారు, పర్మిషన్ లేకుండా సంచరిస్తున్న బస్సులను సీజ్ చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిపుచ్చుకోవాలని తల్లిదండ్రులను కోరుతున్నారు, ప్రైవేట్ బస్సులు పల్లెల లోకి రాకుంటే గ్రామ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని తుమ్మలపంపాడు గ్రామంలో సోమవారం పిఓడబ్ల్యూ రిజర్వాద్రాలు నర్సక్క నాయకులు నాగయ్య ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకొని అనుమతులు ఉంటేనే గ్రామానికి చెందిన విద్యార్థులు తరలించవద్దని అనుమతులు లేని స్కూల్ బస్సులను అధికారులకు అప్పగిస్తామని హెచ్చరించారు.