గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో శేషగిరిరావు

Oct 29, 2025 - 10:25
Oct 29, 2025 - 10:26
 0  5
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో శేషగిరిరావు
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో శేషగిరిరావు

అడ్డగూడూరు 28 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మంగమ్మ గూడెం గురుకుల పాఠశాలను ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం హాస్టల్ నిద్రలో భాగంగా అడ్డగూడూరులోని గురుకుల పాఠశాలలోని వంటగదిని,ఆహార పదార్థాలను,వంట సామగ్రిని విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేసి

విద్యార్థులతో కలిసి ఎమ్మార్వో,ఎంపీవో భోజనం చేశారు. విద్యార్థుల యొక్క తరగతి గదులను కూడా తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ శేషగిరిరావు,ఎంపీఓ ప్రేమలత,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.