సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

జోగులాంబ గద్వాల 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఈనెల 16వ తేదీ (సోమవారం) మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని ఆయన తెలిపారు.