నూతన మీడియా పాలసీని ప్రకటించాలి
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ
హైదరాబాద్ /నవంబర్ 11 రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 239 ని రద్దుచేసి నూతన మీడియా పాలసీని ప్రకటించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. సోమవారం హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర పౌర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలపై నిర్దిష్టమైన పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.యూట్యూబ్ చానల్స్, చిన్న పత్రికలు వాటి స్థితిగతులను పరిశీలించి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.
హెల్త్ కార్డులను అన్ని కార్పోరేట్ ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో అందించాలని విజ్ఞప్తి చేశారు.
అక్రిడిటేషన్ కమిటీ లో అన్ని జర్నలిస్టు సంఘాలను భాగస్వామ్యం చేసి వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు .
జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని అన్నారు. జాయింట్ డైరెక్టర్ ను కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తక్కల్లపల్లి రాజేందర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ, రాష్ట్ర నాయకులు పెండెల సుమన్, బాలకృష్ణ, భాస్కర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.