జూన్ 26 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై

జూన్ 26 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై జరుగు ధర్నాలో అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి..

Jun 24, 2024 - 20:31
 0  4
జూన్ 26 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై

మ్మాది వెంకటేశ్వర్లుసీఐటీయూ జిల్లా కార్యదర్సి

సూర్యాపేట టౌన్:- గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు కొరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జూన్ 26 న జరుగు ధర్నాలో జిల్లాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపు ఇచ్చారు..

సోమవారం నాడు సీఐటీయూ జిల్లా కార్యాలయం లో జరిగిన సీఐటీయూ జిల్లా కమిటి సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభుత్వాన్ని కి వ్యతిరేకంగా పని చేసిన గ్రామ పంచాయతీ కార్మికులను ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడ అదే పద్ధతుల్లో నెల నెలా వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని దీంతో యాడాది కాలం గా వేతనాలు అందక పూట గడవక కార్మికులు పస్తులతో పని చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.. గ్రామ పంచాయతీ సర్పంచ్ లు తమ కాలం ముగిస్తుందని వచ్చిన వేతన బిల్లులు కూడా డ్రా చేసుకొని కార్మికుల కఢుపు కొట్టారని అయన విమర్శించారు..వేతనాలు అందడం లేదని ఏ ఒక్క రోజు పని మానేసిన గ్రామ సీమలు కంపు తో నిండుతాయని దీంతో ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు...

తక్కువ వేతనం తో ఎక్కువగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని, లెకుంటే దీర్గ కాలిక నిరవధిక సమ్మెకు కూడ వెళ్లేందుకు సిద్ధ పడతారని నెమ్మాది హెచ్చరించారు..
అలాగే మల్టి పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరి వైజ్ గా వేతనాలు పెంచాలని, నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు...
ఈ సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు అధ్యక్ష వహించగా సీఐటీయూ నాయకురాలు చేరుకు యాకలక్ష్మీ, యల్కా సోమన్న, బుర్ర శ్రీనివాస్, అనంత ప్రకాశ్ ఎం ముత్యాలు, రన్ మియా, వరలక్ష్మి, వజ్జేసైదులు, బి.రామూర్తి, స్వరాజ్యం,తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333