రైతన్నలు పంటల సాగు పట్ల అవగాహనా కలిగి ఉండాలి

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల:-మంచి దిగుబడిని ఇచ్చే పంటలను పండించుకోవాలని, దిగుబడిని పెంచే పంటలను వేసుకోవాలని మోసపోయి నకిలీ విత్తనాలు కొనకూడదని విత్తనాల కోనుగోలు విషయంలో అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజలకు తమ పాటల ద్వారా డప్పు కొడుతూ అవగాహన కల్పించారు.గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దువాసిపల్లి గ్రామం లో మంగళవారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డి పి ఆర్ ఓ అరీఫుద్దీన్ సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులు రైతన్న దేశానికీ అన్నం పెట్టె రారాజు కాబట్టి రైతన్నా మీరు మంచి పంటలను పండించి దిగుబడిని పెంచే పంటలను వేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు రైతులు పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఇంచార్జి ఎండీ రాహుల్, కోఆర్డినేషన్ తొ కేశవులు భూపతి కవిత స్వామి రమాదేవి, హజరత్, కృష్ణ పాల్గొన్నారు.