అలా మొదలైన ఆపద్బాంధవుల ఫౌండేషన్ ప్రయాణం
మే రెండో తేదీన 4వ ఆవిర్భావ దినోత్సవం
అడ్డగూడూరు 02 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఏప్రిల్ 28 .2020 రోజున నాలుగేళ్ల క్రితం రాజేంద్ర నగర్ లోని లింబ్రా హోటల్ దగ్గర పికెట్ డ్యూటీ చేస్తున్న క్రమంలో ఇద్దరు దంపతులు(మెస్త్రి) పనులు చేసుకునే వాళ్ళు నా డ్యూటీ దగ్గరకు వచ్చి,సర్ ఇక్కడెక్కడో బియ్యం ఇస్తారంట కదా సారు,నేను నా భార్య పిల్లలు,అమ్మ నాన్న రోజుకు ఒక పూట తింటూ రెండు పూటలు నీళ్లు తాగి పడుకుంటున్నాం.కరోన మహమ్మారి వలన రోజు చేస్తే మెస్త్రి పని లేకుండాపోవడంతో ఇలా రోడ్డున పడ్డాము అన్నారు.ఒక్కసారిగా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగి వారిని అక్కడే ఉంచి,దగ్గరలో ఉన్న ఒక దుకాణం దగ్గరకు వెళ్లి బియ్యం,పప్పు,గోదుమపిండి,రవ్వ,నూనెసుమారుగా 15వందల రూపాయల సరుకులు తీసుకొని వారికి అందచెయ్యడం జరిగింది.వారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంత కష్ట కాలంలో మా ఆకలి తీర్చిన వ్యక్తివి. నిన్ను మా జన్మలో ఎప్పటికి నిన్ను మరువము సారు, అంటూ,మీరు చల్లగా బ్రతకాలని ఆశీర్వాదిస్తూ వెళ్లిపోయారు.వారికి సహాయం చేస్తూ ఫోటో తీయించుకొని ,మీరు మీ చుట్టుపక్కల ఒక్క కుటుంబానికైనా సహాయం చెయ్యాలి అంటూ స్టేటస్లో ఇదే నా చాలంజ్ అంటూ పెట్టడం జరిగింది,చాలా మంది గుడ్ జాబ్,నేను స్వీకరిస్తున్న లాంటి సమాధానాలు వచ్చయి.మరో అడుగు ముందుకు వేసి నేవి ఉద్యోగి కాగుల వెంకటేష్ తమ్ముడు నేను బయటకు రాలేని పరిస్థితి నేను ఓ కుటుంబానికి అయ్యే ఖర్చు భరిస్తాను అని డబ్బులు పంపుతున్న, మిరే నా తరుపున సహాయం చేయండి అన్నాడు,నెక్స్ట్ గోవర్ధన్ అన్న,పల్లె అంజి,ఏడ్పుల వెంకటేష్ అన్న(గ్రూపు క్రియేట్ చేద్దాం అని సలహా ఇస్తు), నీలం శేఖర్ అన్న అలా మూడు రోజులు గడిచిన తరువాత మే -2 -2020 రోజు నాకు వచ్చిన ఆలోచన "మన చుట్టూ మానవత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు" వేదిక లేదు,నేనే ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటూ ,మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ గ్రూప్ స్టార్ట్ చెయ్యడం జరిగింది,అలా మొదలై 950 మంది మానవత్వం కలిగిన సైన్యం,సుమారుగా 80మంది మహిళలు( రైతులు,ఉద్యోగులు,నిరుద్యోగులు,ప్రవేట్ జాబ్ చేసేవాళ్ళు,ఇలా ఇలా అన్ని కులాలు మతాలు,జాతులు,ఒక్క మాటలో చెప్పాలి అంటే పక్కవాడు ఆపదలో ఉంటే ఆదుకోవాలని గొప్ప మనసు కలిగిన వాళ్ళు అందరూ) నెల నెల ,వారి&వారి పిల్లల పుట్టిన,పెళ్లి రోజులు ఎలాంటి మంచినైనా సహాయం పంపుతూ,సుమారుగా 48 నెలల్లో 40లక్షల పై చిలుకు డబ్బులతో 4000+కుటుంబాలకు సహాయం. ఇదంతా ఆపద్బాంధవుల వలనే సాధ్యం అయ్యింది.ఆ జంటను భగవంతుడే పంపి మరో 4000+మందికి సహాయం చేసేలా చేశాడేమో.రిజిస్ట్రేషన్ సభ్యుల గొప్ప సపోర్ట్ కొండంత బలం దత్తు అన్న సైదులు అన్న రాoమూర్తి సర్ మహేష్,హరికృష్ణ,నేనావత్ శివ.ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో మంది..జయహో ఆపద్బాంధవుల..కృతజ్ఞతలు
1)మేము కంటికి కనిపించకపోయినా మా సహాయం పేదవారికి అందలి అని నెల నెల డబ్బులు పంపిన ప్రతి ఒక్కరికీ
2) ఆకలితో అలుమటిస్తున్న వారు కనిపిస్తే సమాచారం ఇస్తు,సమయం చెయ్యడం కోసం ఒక రోజు పూర్తి సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికీ
3)ప్రతి సహాయాన్ని భుజస్కందలపై వేసుకొని ప్రపంచానికి తెలిసేలా స్టేటస్ పెట్టిన ప్రతి ఒక్కరికీ &రిజిస్ట్రేషన్ సభ్యులకు 950 మంది సైన్యం ప్రతి ఒక్కరికీ 4)సహాయాన్ని మానవత్వ కోణంలో సమాజానికి చూపిన పాత్రికేయ మిత్రులకు
5) ఈ నాలుగేళ్ల ప్రయాణంలో తోడు నడిచిన ప్రతి కాలుకు ,ప్రతి చేతికి,ప్రతి మనిషికి ప్రత్యేక కృతజ్ఞతలు..జయహో మన ఆపద్భాందవులు ఫౌండేషన్
మే రెండవ తేదీ 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 కుటుంబాలకు జీవనోపాధి కలిగించే మార్గంలో 950 సైన్యం వెళ్తున్నమని తెలియజేయడానికి సంతోషంగా ఉందని అన్నారు.