కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు
గొడపత్రికలు విడుదల
జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఈనెల 20న జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండిని పిలుపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి ఆంజనేయులు డిమాండ్ చేశారు, మంగళవారం రోజున గద్వాల జిల్లా కేంద్రంలోAITUC CITU,IFTU కార్మిక సంఘాల నేతలతో కలసి ఈనెల 20న జరిగే దేశ వ్యాపిత సమ్మె పోస్టర్లను విడుదల చేయడం జరిగింది.
ఈసంద్భంగాఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు,cituc జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ,iftu కార్యదర్శి కార్తీక్ లు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల నుంచి 29 కార్మిక చట్టాలను విడదీసి నాలుగు లేబర్ కోడులుగా చేశారని అన్నారు.కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్ లు దేశం లోని విదేశీ కార్పొరేట్లకు అనులులంగా ఉన్నవని అన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలనీ అన్నారు. కనీసం వేతనం ₹. 26000/- చెల్లించాలని అన్నారు. స్కీమ్స్ వర్కర్స్ ను (అంగన్వాడీ, మధ్యాహన భోజనం కార్మికులు, ఆశ )ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు.. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటికర్ణ ఆపాలని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని అన్నారు.కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టు బానిసలుగా తయారు చేయాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు*ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణను వెంటనే ఆపివేయాలని,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్,థర్డ్ పార్టీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి,జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు,కారోబార్లను పంచాయతీ కార్యదర్శి గా నియమించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు.*ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యరాజు,citu జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ, ఇఫ్టు దానయ్య, AITUC ఆటో యూనియన్ అధ్యక్షులు తాటికుంట వెంకటేష్,aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆటో కార్మికులు శాంతాన్న తదితరులు పాల్గొన్నారు