వంతెనపై వాహనాల రద్దీ.. స్తంభించిన రాకపోకలు
జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పట్టణంలో పెద్దవాగుపై నిర్మించిన వంతెన పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా తయారయింది. కొత్త బస్టాండ్ వెనక ఉన్న చిన్న వంతెన పై వాహనాలు ఒకేసారి వెళ్లడంతో రద్దీ పెరిగి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మంగళవారం సుమారు అరగంట పాటు వాహనాల రద్దీతో రాకపోకలు స్తంభించాయి. కొత్తగా నిర్మించిన వంతెనను ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.