అనుమతులు లేకుండా మొక్కజొన్నల తరలింపు?

Sep 10, 2026 - 18:04
 0  11
అనుమతులు లేకుండా మొక్కజొన్నల తరలింపు?
అనుమతులు లేకుండా మొక్కజొన్నల తరలింపు?

రెండు డీసీఎంలను అడ్డుకున్న లారీ అసోసియేషన్ డ్రైవర్లు.

 జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం, కొండపల్లి రోడ్డులోని భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన గ్రామీణుల గిడ్డంగుల గోదాం నుంచి అనుమతులు లేకుండా మొక్కజొన్నలను తరలిస్తున్నారన్న సమాచారం కలకలం రేపింది.గోదాం నుంచి మొక్కజొన్నలను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను లారీ అసోసియేషన్ డ్రైవర్లు అడ్డుకున్నట్లు తెలిసింది.గోదాం నుంచి నిల్వలను తరలించాలంటే సంబంధిత అధికారుల అనుమతులు, నిబంధనల ప్రకారం ప్రక్రియ ఉండాల్సి ఉందని డ్రైవర్లు పేర్కొన్నారు.అయితే ఎలాంటి టెండర్లు లేకుండా మొక్కజొన్నలను తరలించడం వెనుక గోదాం ఇన్‌చార్జి పాత్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, మొక్కజొన్నల తరలింపునకు అనుమతులు ఉన్నాయా? లేక నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారా? అనే విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333