అల్మాస్‌గూడ లో ఆయుష్మాన్ హాస్పిటల్స్ ఘనంగా ప్రారంభం
హైదరాబాద్,26 ఫిబ్రవరి 2026 గురువారం తెలంగాణ వార్త :మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్‌గూడ కమాన్ దగ్గర ఆయుష్మాన్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ర్స్ పి జగదీశ్వర్ రెడ్డి,డి సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ వ్యాస్,బీర మధుకర్ రెడ్డి మాట్లాడుతూ... అల్మాస్‌గూడ ప్రజలందరికీ ఆయుష్మాన్ హాస్పిటల్స్ అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ హాస్పిటల్లో 50 పడకల సౌకర్యంతో పాటు మహిళలు, పిల్లలు అన్ని వయస్సుల వారికి వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. గైనిక్ స్పెషలిస్ట్ న్యూరో స్పెషలిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పలు రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని,స్థానిక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.