515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన 

Feb 25, 2026 - 19:45
 0  8
515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన 
515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన 

ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.

జోగులాంబ గద్వాల 25 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  అలంపూర్. నియోజకవర్గoలో పేద కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు  515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలంపూర్, అయిజ, మానవపాడు, ఇటిక్యాల, ఉండవెల్లి, వడ్డేపల్లి, ఎర్రవల్లి మండలాల చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రతి చెక్కు ₹1,00,116 విలువతో ఈ పథకాలు పేదలకు గొప్ప ఆర్థిక భరోసా అందిస్తున్నాయి. అనంతరం  మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ విజయుడు , "515 మందికి ఆర్థిక సహాయం అందించడం నాకు సంతోషకరం. ఆలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను" అని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే  కృషిని ప్రశంసించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333