హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్,  జోగుళాంబ గద్వాల.

ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసిన, జోగుళాంబ గద్వాల  జిల్లా హోమ్ గార్డ్స్.

Dec 7, 2024 - 18:02
 0  17
హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్,  జోగుళాంబ గద్వాల.
హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్,  జోగుళాంబ గద్వాల.

జోగులాంబ గద్వాల 7 డిసెంబరు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల డిసెంబర్ 6, హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా
తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న హోమ్ గార్డ్స్‌కు  ముఖ్యమంత్రి శ్రీ.ఎ.రేవంత్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు.
హోమ్ గార్డ్స్ పట్ల ఆత్మీయతను చాటుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న  కొన్ని కీలక నిర్ణయాలు ఈ క్రింది విధంగా వున్నాయి. 
హోమ్ గార్డుల దినభత్యం రూ. 921 నుండి రూ. 1000కి పెంపు.
 వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు రూ. 100 నుండి రూ. 200కి పెంపు.
విధుల నిర్వహణలో సహజమరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణం కలిగిన హోమ్ గార్డ్స్ కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయడం. ఇవేకాకుండా, ఆరోగ్యశ్రీ Health Scheme ను హోమ్ గార్డ్స్ కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
 ఇవన్ని కూడ జనవరి నెల 2025 నుండి అమలు లోనికి వస్తాయి.
ముఖ్య మంత్రి  సహృదయ నిర్ణయాలను పురస్కరించుకొని, జోగుళాంబ గద్వాల జిల్లా హోమ్ గార్డ్స్  కార్యాలయం  నందు,  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ విజయ భాస్కర్ , హోంగార్డ్స్ రాజశేఖర్ మరియు పరశురాముడు, కృష్ణ, యుగంధర్, ఈశ్వరమ్మ, సురేఖ, ప్రమీల, కురుమన్న బి.కృష్ణ, శ్రీనివాస్, నిజాముద్దీన్, హుస్సేన్ లు పాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333