కలెక్టరేట్ ఆఫీస్ ముందు మహాధర్నా
ఏవో జగన్మోహన్ వికలాంగులకు 6వెలు పెన్షన్ ఇవ్వాలని వినతి పత్రం అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
భువనగిరి 25 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించిన వి వికలాంగుల జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచాలని,పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్స్ మంజూరు చేయాలని
25న కలెక్టరేట్ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహిస్తూ అనంతరం ఏవో జగన్మోహన్ వినతిపత్రం ఇచ్చి అనంతరం ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ గార్లు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచుతామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్ 4000లకు పెంచుతామని హామీ ఇచ్చినారని, అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు,కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు.ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలావెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి, వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయూలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి బడ్జెట్ లో 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు,సదరం సర్టిఫికెట్స్ రిజెక్ట్ అయినా వారికి సర్టిఫికెట్స్ పునరుద్దరించాలని. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ,2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భోల్లపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత భువనగిరి డివిజన్ కార్యదర్శి గడ్డం యాదగిరి చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు తుంగ భూపాల్ రెడ్డి డివిజన్ కార్యదర్శి ఏర్పుల శివయ్య ఆలేరు డివిజన్ కార్యదర్శి మెరుగు బాబు ఆలేరు డివిజన్ అధ్యక్షులు కొలనుపాక నాగయ్య భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ మురళి ఎన్ పి ఆర్ డి జిల్లా ఉపాధ్యక్షులు పిట్ట శ్యామసుందర్ చౌటుప్పల్ మండలాధ్యక్షులు సంజీవ శంకర్ జిల్లా నాయకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి,నాగు నరసింహ,కుల్సోత్ అనసూయ,న్నబోయిన మంగమ్మ,బోల బిక్షపతి,ఏ వెంకటేశం,ఉన్న శ్రీధర్,పల్లెర్ల జంగయ్య,దిడ్డికాడి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.