ఏనుభాముల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలు యువకుల ర్యాలీ

Feb 1, 2025 - 20:08
 0  7
ఏనుభాముల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం  మహిళలు యువకుల ర్యాలీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  ఏనుభాముల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళ లు యువకుల ర్యాలీ గ్రామంలో మద్యం అమ్మితే 50వేలు జరిమానా.. ఏకగ్రీవ తీర్మానం.. ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని ఏను బాములగ్రామం లో నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు అఖిల పక్షాల ఆద్వర్యం లో గ్రామం లో ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు.బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఒకవేళ ఎవరైనా మద్యం విక్రయిస్తే 50 వేల రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్మును గ్రామ పంచయతీ కి అప్పగించి గ్రామ అభివృద్ది పనుల కు ఖర్చు చేయాలని తీర్మానo చేశారు. జనవరి 9న గ్రామంలో అఖిల పక్షాల ఆద్వర్యం లో సమావేశం ఏర్పాటు చేసి మద్య నిషేధం అమలు పై తీర్మాణించినట్లు ఉద్యమ నాయకుడు తగుళ్ళ జనార్దన్ తెలిపారు. బెల్ట్ షాపుల వారి కోరిక మేరకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు.ఫిబ్రవరి 1నుండి గ్రామం లో బెల్ట్ షాపులు బంద్ చేయడమే కాక గ్రామం లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. *మద్య నిషేధం కు మండల జేఏసీ సంఘీభావం ఇవ్వడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లోఈ కార్యక్రమంలో తగుళ్ళ జనార్ధన్ యాదవ్, కలకోట్ల సీతారాములు ,పసునూరి అంజి, కోడిమల నాగరాజు, సైదులు, పారేల్లి నవీన్, నరేష్, రాజు ,కృష్ణ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.