సంగాల గ్రామంలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం

Apr 2, 2026 - 19:41
Apr 2, 2026 - 20:49
 0  5
సంగాల గ్రామంలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం
సంగాల గ్రామంలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం

రోడ్డున పడ్డ కుటుంబం

దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం..

గద్వాల రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్యపురెడ్డి

గ్రామ సర్పంచ్ రాజశేఖర చేతులమీదుగా 3000 రూపాయల ఇంటి సరుకులు 53,000/- నగదు బాధితులకు అందజేత

 జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గత వారం రోజుల క్రిందట గద్వాల మండలం, సంగాల గ్రామంలో నివసిస్తున్న అంజలమ్మ కొండన్న లకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. గుడిసె కాలిపోయిన ప్రమాద సంఘటనలో కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగలేదు కానీ ఆ కుటుంబానికి అవసరమైన దాన్యము, బట్టలు, డబ్బులు గుడిసెలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోవడం జరిగింది. జరిగిన ప్రమాద సంఘటనను మానవసేవే-మాధవ సేవ గ్రూపు సహకారంతో దాతలు స్పందించి ఎవరికి తోచిన విధంగా వారు ఆర్థిక సహాయం అందజేశారు. గుడిసె కాలిపోయి రోడ్డున పడ్డ ఆ కుటుంబానికి దాతలు సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలబడి మానవసేవే - మాధవసేవ గ్రూప్ ద్వారా దాతలు సహకారంతో 56,000 రూపాయలు నగదు రాగ ఇందులో 3000 రూపాయల సరుకులు, 53000 నగదు రూపాయలను గద్వాల రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ సార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్యప్ప రెడ్డి, గ్రామ సర్పంచ్ రాజశేఖర్ చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగింది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State