జాతీయస్థాయి ఉపకార వేతనానికి ఎంపికైన పోతరాజు మనోజ్ఞ
తిరుమలగిరి 23 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఎన్ ఎం ఎం ఎస్ 2023-24 లో సీటు సాధించిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని పోతరాజు మనోజ్ఞ తండ్రి సోమేష్. ఎన్ ఎమ్ ఎస్ అనగా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్. జాతీయ స్థాయిలో ఉపకార వేతనం కొరకు ఎనిమిదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే పరీక్ష. దీనిలో ఉత్తీర్ణులైన వారికి తొమ్మిదవ తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు సంవత్సరానికి 12 వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దీనికి అర్హత సాధించిన పోతరాజు మనోజ్ఞ కు అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీనికి పాఠశాల ఉపాధ్యాయులు చేసినకృషి అమోఘం. ఇది కాదా ప్రతిభ అంటే.. ప్రభుత్వ పాఠశాలలో ఏదైనా సాధ్యం. దీనికి మన ఉన్నత పాఠశాల యజమాన్యం గౌరవంగా మీ ముందు ఉన్నది. తల్లిదండ్రులారా ఇకనైనా మేల్కోండి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.మీరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి వారిని . తీర్చిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం తెలిపారు