విదేశీయులను స్వదేశానికి పంపించాలని మండల తహశీల్దార్ కి మెమోరాండం ఇచ్చిన బిజెపి

May 6, 2025 - 19:11
May 6, 2025 - 19:28
 0  5
విదేశీయులను స్వదేశానికి పంపించాలని మండల తహశీల్దార్ కి మెమోరాండం ఇచ్చిన బిజెపి

చర్ల మండలకేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు బీజేపీ పార్టీ శ్రేణులు పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్ వంటి విదేశీయులను వెంటనే వారి స్వదేశాలకు తరలించాలని మంగళవారం నాడు తహశీల్దార్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లింలను గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ,చర్ల మండల శాఖ తరుపున కోరుతున్నామని అన్నారు.గత నెల ఏప్రిల్ లో పహల్గంలో భారతీయులపై జరిగిన మారణకాండ పై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్,మయన్మార్ రోహింగ్య ముస్లింలను దేశం నుండి వారి స్వదేశాలకు వెళ్లవలసినదిగా ఆదేశించింది. అటువంటి వారెవరైనా మన మండలంలో నివసించి వునట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వెంటనే స్పందించి అటువంటి వారిని స్వదేశాలకు పంపించాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నూప రమేష్,జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహిం,జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి రమణ, సీనియర్ నాయకులు ఈర్ప సుబ్బారావు,బంధ మధు తదితరులు పాల్గొన్నారు.