జనగణన 2027 శిక్షణ కార్యక్రమం
ఫేస్-1,లో హౌస్‌లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు
జోగులాంబ గద్వాల 20 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న సెన్సస్-2027 (జనగణన) ప్రక్రియలో భాగంగా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలను జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ హై స్కూల్ ఎం. ఎస్ స్వామి నాథన్ డిజిటల్ రూమ్ నందు ఫేస్-1,లో హౌస్‌లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అయిజ మున్సిపాలిటీ కమిషనర్ సైదులు మరియు ఫీల్డ్ ట్రైనర్ ఎం కళిముల , మల్లికార్జున్ ల ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. మొదటి విడత గృహాల జాబితా మరియు గృహ గణన ప్రక్రియ. నినాదం: "జనగణనతో ప్రజా సంక్షేమం" అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ,మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,