ఎమ్మెల్యే మందుల సామేలుపై వస్తున్న ఆరోపణలను సరికావు మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి

Apr 20, 2026 - 21:28
Apr 20, 2026 - 21:29
 0  7
ఎమ్మెల్యే మందుల సామేలుపై వస్తున్న ఆరోపణలను సరికావు మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి

అడ్డగూడూరు 20 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– చెరువు మట్టి తరలింపు ధర్మారం గ్రామ పంచాయతీ తీర్మానం మరియు అధికారుల అనుమతితోనే చెరువు మట్టిని తరలిస్తున్నారని,ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇటుకల కొరత లేకుండా ఈ మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.టిఆర్ఎస్ పై విమర్శలు గత పదేళ్లలో బిక్కేరువాగులో ఇసుక దోపిడీ జరిగిందని,మిషన్ కాకతీయ పేరుతో పనులు చేయకుండానే నిధులు కాజేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అభివృద్ధి పనులు ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం,ప్రభుత్వ కార్యాలయాల మంజూరు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,దీనిని ఓర్వలేకనే బిఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల కేటాయింపు గతంలో ఉపాధి హామీ నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు.ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. నిమ్మనగోటి జోజి (కాంగ్రెస్ మండల అధ్యక్షులు) నర్సిరెడ్డి (మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్) ముక్కామల శ్రీకాంత్, (సర్పంచ్‌లు) రాచకండి రమేష్ గౌడ్ , వల్లంభట్ల రవీందర్ రావు (సీనియర్ నాయకులు) మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.