మల్లు స్వరాజ్యం ఆశయ సాధన కోసం కృషి చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మల్లు స్వరాజ్యం ఆశయ సాధన కోసం కృషి చేయాలి ఆత్మకూరు ఎస్:- మల్లు స్వరాజ్యం ఆశయ సాధనం కోసం కృషి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి అవిరె అప్పయ్య గ్రామ కార్యదర్శి సానబోయిన ఉపేందర్ లు పిలుపునిచ్చారు. మండలం లోని ఏపూరు గ్రామం లో స్థానిక అమరవీరుల స్మారక భవనం లో మల్లు స్వరాజ్యం గారి మూడో వర్ధంతి సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అతి చిన్న వయసులో ఆరోజుల్లో మహిళలను ఇంటికే పరిమితం చేస్తున్న సందర్భంలో అనేక కట్టుబాట్లు మధ్యన భూస్వామ్య కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలకు అధిపతులు అయినా కూడా సాధారణ జీవితం గడుపుతూ తన కోసం కాకుండా అందరి అణిచివేతకు గురవుతున్న ప్రజలకు అండగా నిలబడుతూ 16 సంవత్సరాలకే స్వరాజ్యం గారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వారి అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి సహకారంతో తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకు నడుస్తూ పెట్టుబడి భూస్వామ్య పెత్తందారులకు వణుకు పుట్టించిన ఘనత స్వరాజ్యం గారు అని అన్నారు.బందుకు చేతబట్టి దొరలకు పెత్తందారులకు జాగిర్ దారులకు కు రజాకా ర్ లకు వ్యతిరేకంగా భూమి, బుక్తి, వెట్టిచాకిరి ,విముక్తి కోసం ముందుకు సాగుతూ కధన రంగంలోకి దూకి వారి జీవితాన్నే ప్రజా పోరాటలకు అంకితం చేశారని వారన్నారు. ప్రజా ఉద్యమాలను మహిళా హక్కుల సాధన కోసం సమ సమాజ స్థాపన కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమవుతూ వారు కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ పేదల కోసం అహర్నిశలు కృషి చేశారని వారు కొనియాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సాధారణ జీవితం గడుపుతూ ఎందరుకో ఆదర్శంగా నిలిచారు. సూర్యాపేట తుంగతుర్తి ప్రాంత ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కృషి చేశారని వారు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం పూర్తి అయిన తర్వాత పార్టీలో చీలికలు వచ్చిన సిపిఐఎం మార్క్సిజం వైపు నిలబడి పార్టీని బలోపేతం చేసిన చరిత్ర స్వరాజ్యం గారిది వారు అందరితో మమేకమై వాళ్ళ సొంత కుటుంబంలో చూసుకునేటువంటి మంచితనం వారి సొంతం అని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఎరుకల నాగరాజు శాఖ కార్యదర్శిలు నూకల గిరిప్రసాద్ రెడ్డి, వరికుప్పల మహేష్ ,నవిల రవి, నవిల లింగయ్య ,అవిరె సాయి, నవిల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.