జోగులాంబ నమోస్తుతే.....

Feb 14, 2024 - 20:19
Feb 14, 2024 - 21:37
 0  6
జోగులాంబ నమోస్తుతే.....
జోగులాంబ నమోస్తుతే.....

జోగులాంబ- గద్వాల 13 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త  ప్రతినిధి:- అలంపూర్  రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు జోగులాంబ అమ్మవారి ఆలయంలోని యాగశాల నందు ఇత్య హోమములు, అనంతరం మహా పూర్ణాహుతి కలశ ఉద్వాసన సహస్ర ఘటనలకు ఆవాహన అర్చన నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి మూలమూర్తికి అవబృద పాపానం, పంచామృతాభిషేకం నిర్వహించారు.జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఆరంభం కావడంతో ఒక్కసారిగా జోగులాంబ దేవి భక్తులు భక్తి పారవశ్యంతో నినాదాలు చేశారు. 10 గంటల నుంచి 2 గంటల వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి కళశాలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పంచామృత కళాశాలతో అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల సందడి నెలకొంది. వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపులో భాగంగా సాయంత్రం 4:30 గంటలకు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణోత్సవాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ శాంతి కళ్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు.

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ప్రత్యేకత

సాధారణ రోజుల్లో అమ్మవారికి జరిగే అభిషేక కార్యక్రమాలను భక్తులు ఎవరు వీక్షించే అవకాశం ఉండదు. ప్రతినిత్యం స్వర్ణ ఆభరణాల అలంకరణల మధ్య మాత్రమే జోగులాంబ అమ్మవారిని దర్శించగలుగుతాము. అయితే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా వసంత పంచమి రోజు మాత్రమే ఎలాంటి అలంకరణ లేకుండా సహజసిద్ధమైన అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుని అభిషేకించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. దీన్ని అమ్మవారి నిజరూప దర్శనం గా భక్తులు భావిస్తారు. జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో జోగులాంబ జాతర నిర్వహించారు. భక్తులకు పుష్కర ఘాట్ సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333