కుల నిర్మూలన కోసం ఐక్యంగా ఉద్యమించాలి..
మనువాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి..
తప్పెట్ల స్కైలాబ్ బాబు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ లాంటి కుల వ్యవస్థను నిర్మూలించల్సిన అవసరం ఎంతైనా ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపెట్ల స్కైలాబ్ బాబు అన్నారు.కెవిపిఎస్ సూర్యాపేట జిల్లా స్థాయి సామాజిక శిక్షణా తరగతులు ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవనంలో ప్రారంభమయ్యాయి.ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తరతరాలుగా మనస్మృతి, మనుధర్మ శాస్త్రం ఆధారంగా మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదన్నారు. కులం పేరా దాడులు,దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని మను ధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని అంటున్నారు. దళిత గిరిజన ప్రజల పైన దాడులు చేసి హత్యలు,అత్యాచారాలు చేసిన వాళ్లను దండలేసి ఊరేగింపులు చేయడం అంటే కులోన్మాద భావజాల మూలాలేనని అన్నారు. నేడు విద్య వైద్యం పేదలకు అందడం లేదని సంక్షేమ రంగాలపైన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పలాలను ప్రతి పౌరుడు అందుకునే రోజు రావాలంటే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను కాడుకొవల్సిన అవసర ముందన్నారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు ఇండ్లు ఇండ్ల స్థలాలు విదేశీ విద్యా నిధి పథకం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల దళిత గిరిజనుల పైన దాడులు పెరిగాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. పెరుగుతున్న ధరల ప్రకారం మెస్ కాష్మోటిక్ చార్జీలు పెంచాలని అన్నారు. హాస్టల్ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాలని అన్నారు.ఈ క్లాసుల ప్రారంభ సూచికగా ఆత్మగౌరవం, సమానత్వం,కుల నిర్మూలన గల కెవిపిఎస్ జెండాను స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు.ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వర రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, జిల్లా ఉపాధ్యక్షులు,నందిగామ సైదులు,టేకుల సుధాకార్, మీసాల వీరబాబు,జిల్లా సహాయ కార్యదర్శి దుర్గా రావు,జిల్లా నాయకులు హూస్సెన్,నరసింహరావు,పిట్ట గోపి,మెరిగ శ్రీను,కస్తాల మహేశ్,సందీప్,శ్రీను,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.