చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు

తిరుమలగిరి 02 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు 24 సంవత్సరాల తర్వాత ఆత్మీయ కలయికతో ఒకరికి ఒకరు యోగక్షేమాలతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని చదువుకున్నటువంటి పాఠశాల ప్రాంగణంలో నాటి పూర్వపు గురువులను పిలుచుకొని ఘనంగా సన్మానించి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వారి తోటి చదువుకున్న పూర్వపు విద్యార్థి బీసు యాకన్న అకస్మాత్తుగా మరణించగా వారి కుటుంబానికి స్నేహితులు బీసు అనిత కుటుంబానికి యాకన్న తోటి చదువుకున్న పూర్వపు విద్యార్థులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉపాధ్యాయుల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో వెలిశాల ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుకునూరి అశోక్ రెడ్డి. ఉపాధ్యాయులు రామలింగయ్య. శ్రీను. రవీందర్. శ్రీనివాస్. పార్థసారథి. అనంత రెడ్డి. ఈశ్వరయ్య. పాపయ్య. సత్యనారాయణ రెడ్డి. బండి యాదగిరి ఆకుల రమేష్. పూర్వపు విద్యార్థులు. దుపాటి వెంకన్న. మద్దెల యాదగిరి. ఏపూరి రమేష్. శంకరాచారి. మహేంద్ర చారి. మురళి కృష్ణ. సోమన్న.. పాలకుర్తి సవిత. జిలకర మల్లేశ్వరి. ఆకుల మంజుల. చేను స్వరూప. బ్రహ్మదేవర త్రివేణి. దుపటీ ఇందిర. మద్దెల ఏకలక్ష్మి. తదితరులు పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు