చర్ల మండల పరిధిలోని ఎవరూ లేని గృహంలో మరోచోరి

Feb 18, 2025 - 21:34
 0  67
చర్ల మండల పరిధిలోని ఎవరూ లేని గృహంలో మరోచోరి

చర్ల 18-02-2025

చర్ల మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ దొంగలు కేంద్రంలోనే కాక పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా గృహంలో ఎవరు లేని సమయంలో టార్గెట్ గా పెట్టుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి సమయంలో చర్ల మండల పరిధిలో గల సత్యనాపురం గ్రామంలో ఉన్న నడిమిపల్లి రామచంద్రరావు రాజు గృహంలో దొంగదనం జరిగింది. రామచంద్రరావురాజు వారి బంధువుల ఊరికి వెళ్ళిన సమయంలో ఈ సంఘటన జరిగిందని, నగదు, బంగారం పొయి ఉంటుందని సత్యనారాయణ పురం గ్రామస్తులు, వారి బంధువులు తెలిపారు. ఈ సమాచారం మండల పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వటంతో సీఐ రాజువర్మ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ధర్యాప్తు చేస్తున్నారు.