తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా ను మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ చట్ట సవరణ బిల్ వ్యతిరేక తీర్మానం పై ప్రశంసించిన అడ్వకేట్ సాదిక్ షేక్

3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా ను మర్యాదపూర్వకంగా సమ్మాన్ ఎన్జీవో (సొసైటి ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి మరియు న్యాయ్) వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్ సాదిక్ షేక్ కలిసి వక్ఫ్ చట్ట సవరణ బిల్ పై రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేక తీర్మానాన్ని , సీఈఓ విధులను పొడిగిస్తూ వెలువడిన హై కోర్టు ఉత్తర్వుల పై హర్షం వ్యక్తం చేశారు . బిజేపీ ఎన్ డి ఏ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్ 2024 కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన భారతదేశ మొట్టమొదటి వక్ఫ్ బోర్డు గా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చరిత్ర కి ఎక్కడం ఎంతో గర్వకారణం అని సీఈఓ ఛైర్మన్ మరియు గౌరవ బోర్డు మెంబర్ లకు అడ్వకేట్ సాదిక్ షేక్ శుభాకాంక్షలు తెలిపారు . తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ గా అసదుల్లా విధులను పొడిగిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సాదిక్ షేక్ స్వాగతించారు . అసదుల్లాహ్ లాంటి సీనియర్ మరియు సిన్సియర్ అధికారులు వక్ఫ్ బోర్డు కి ఎంతో అవసరం అని వారి సేవలు ఎప్పుడూ ప్రశంసనీయం అని పేర్కొన్నారు . వక్ఫ్ చట్ట సవరణ బిల్ పై భవిష్యత్తు కార్యాచరణ , వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ , రెవెన్యూ అభివృద్ది తదితర అంశాల పై సీఈఓ అసదుల్లా తో హైదారాబాద్ వక్ఫ్ బోర్డు ఆఫీస్ లో కలిసి చర్చించడం ఎంతో సంతృప్తినిచ్చిందని భవిష్యత్తు కార్యాచరణ వక్ఫ్ చట్ట సవరణ బిల్ పై చట్ట సభల్లో జరిగే తీరుని బట్టి ప్రకటిస్తాం ముఖ్యంగా సమ్మాన్ ఎన్జీవో తరఫున వక్ఫ్ చట్ట సవరణ బిల్ వల్ల కలిగే నష్టాలను, ప్రమాదాలను రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రజలకు వివరిస్తూ చైతన్య కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు .