చదువుల తల్లి తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు

జనసేన పార్టీ జిల్లా నాయకులు లింగరాజు యాదవ్

Mar 10, 2024 - 19:58
Mar 10, 2024 - 20:34
 0  5
చదువుల తల్లి తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు

సూర్యాపేట జిల్లా:- ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన పూలే స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని కోరారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం గుండె ఎరుపుక్కిందిన్నారు బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని భిన్న మార్గాలలో విద్యార్థులు రాకెట్ల దూసుకుపోవాలని ధైర్యాన్నిచ్చారు. ఆనాడు అగ్రవర్ణ మనువాద సమాజం ఎన్నో అవమానాలకు గురి చేస్తున్న వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగి అంధకారంలో బ్రతుకులు వెల్లదీస్తున్న బహుజనుల బ్రతుకుల్లో అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు మళ్లించడానికి కృషి చేసిన వారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాఠశాలలను ఏర్పాటు చేసి వీరు, వారు అని తేడా లేకుండా మహిళలందరికీ చదువులు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అలాగే సావిత్రిబాయి పూలే తో పాటు ఫాతిమా షేక్ ఇద్దరు కలిసి చదువులు నేర్పించారు.

 అగ్రవర్ణ బ్రాహ్మణీయ పిల్లలు సావిత్రిబాయి పూలే పై పేడ బురద చల్లి సూటిపోటి మాటలతో అవమానించిన తన బాధను పంటి బిగువన ఓర్చుకొని ఈ సమాజానికి చదువులు నేర్పిన చదువుల తల్లు లు వీరిద్దరూ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు మాత ఫాతిమా షేక్ .వీరిద్దరిని భారత దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి మరువకూడదని ఈ భారత సమాజం వీరిద్దరికీ రుణపడి ఉండాలని కోరారు అందుకే వీరిద్దరికీ గౌరవిస్తూ, నేడు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి ఇవే ఘన నివాళులు అర్పిస్తున్నాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333