ఘనంగా స్నేహితుల దినోత్సవం.. 

Aug 4, 2024 - 19:18
 0  10
ఘనంగా స్నేహితుల దినోత్సవం.. 

జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. జీవితం అమ్మ నాన్న లు ఇస్తారు, విద్యాభుద్ధులు నేర్పి సమాజం లో ఎలా నడుచు కోవలో చెప్పడం వారి భాద్యత.కాలక్రమేణా సమాజం లో ఒక్కో సందర్బంగా ఒకో వ్యక్తి తో ఏర్పడిన పరిచయం అది తరగతి మొదలు కొని మరణించే వరకు ఏర్పడిన అనుబంధంనే స్నేహం అంటారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గద్వాల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో 1996-1997 విద్య సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు  కలుసుకొని ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ఈసందర్బంగా మరణించిన మిత్రులకు నీవాళ్ళుఅర్పించారు. అనంతరం గతంలో తరగతి దిలో చేసినచిలిపిపనులనుగుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం వారు వారు చేస్తున్నా పనులను మరియు సామాజిక, రాజకీయం అంశాలతో పాటు కష్టం సుఖలను గురించి చర్చించు కున్నారు. స్నేహం అంటే సంతోషం లో పాలు పంచుకోవడం మాత్రమే కాదు, మిత్రునికి కష్టం వచ్చింది అంటే తమకు వచ్చి నట్లు భావించి తన వంతు సహాయం చేస్తు, నీకు ఆపద వస్తే ఆదుకోవడం కోసం మేము ఉన్నాం అంటూ ధైర్యం ఇచ్చి ఆదుకునేందుకు కలసి ఉండాలి అనినిర్ణయం తీసుకున్నారు.ఒకరి ఒకరు స్నేహితుల శుభాకాంక్షలు తెలుపున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333