ఘనంగా సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాలు
తిరుమలగిరి 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లముల యాదగిరి మాట్లాడుతూ హాజరై మాట్లాడుతూ సిపిఐ పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని నిరంతరo ప్రజా పోరాటాలు కొనసాగిస్తుందని ఆయన కొనియాడారు . ఈనెల 30న నల్గొండ జిల్లాలో సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగే భారీ బహిరంగ సభను పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్ డి ఫయాజ్, గ్రామ కార్యదర్శి కనుక అశోక్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జంపాల మల్లయ్య, సుంచు సత్తయ్య, జంపాల శీను, ఎల్లంల కొమురెల్లి , తీపిరాల శ్రీకాంత్,ముత్యాల యాకన్న , కొమరయ్య, కుదురుపాక సోమన్న తదితరులు పాల్గొన్నారు.