ప్రపంచం మలేరియా దినోత్సవం

Apr 25, 2026 - 15:29
Apr 25, 2026 - 15:29
 0  3
ప్రపంచం మలేరియా దినోత్సవం
ప్రపంచం మలేరియా దినోత్సవం

ఈరోజు "ప్రపంచ మలేరియా దినోత్సవం" జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ :- Bనర్సింగ్ రావు  

ఏప్రిల్  25...మలేరియా దినోత్సవ ర్యాలీలో మార్మోగిన నినాదాలు పలు వీధుల్లో ర్యాలీ 

పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె సంధ్యా కిరణ్ మై, జిల్లా హెల్త్ సిబ్బంది మరియు అర్బన్  ఆశా కార్యకర్తలు...

జోగులాంబ గద్వాల 25 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ సంధ్య కిరణమై   ఆధ్వర్యంలో ఈరోజు పాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు ఉదయం 9. 30 గంటలకు.. "ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 " ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు  చేతుల మీదుగా ర్యాలీని ప్రారంభించారు.. మలేరియా దినోత్సవ నినాదాలతో ఆశా కార్యకర్తలు పురవీధుల గుండా ప్రయాణించి పాత డీఎంహెచ్ఓ ఆఫీస్ కు చేరుకున్నారు సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ... ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారని మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలు ఉన్నారని సందర్బంగా తెలిపారు.

 అనంతరం డిఎంహెచ్వో డాక్టర్ సంధ్య కిరణ్ మై మాట్లాడుతూ..మలేరియా నివారణకు పాటించాల్సిన 4 ముఖ్యమైన జాగ్రత్తలు..తీసుకోవాలని.. తెలుపుతూ

. 1. దోమల నివారణ..... మలేరియా 'అనాఫిలిస్' అనే ఆడ దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కుండలు, కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని. దోమలు పెరగకుండా కిటికీలకు మెష్‌లు అమర్చుకోవడం, దోమతెరలు వాడటం ఎంతో అవసరమని

2. వ్యక్తిగత రక్షణ..... సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు ధరించాలి. దోమలు కుట్టకుండా ఉండేందుకు క్రీములు లేదా సహజ సిద్ధమైన వేప నూనె వంటివి రాసుకోవాలి. పిల్లలు, గర్భిణీ స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని

3. . లక్షణాలను గుర్తించడం..... తీవ్రమైన చలితో కూడిన జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు మలేరియా ప్రధాన లక్షణాలు. జ్వరం వచ్చినప్పుడు సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని త్వరగా నయం చేయవచ్చు.

4. పూర్తిస్థాయి చికిత్స..... రక్త పరీక్షలో మలేరియా అని తేలితే వైద్యులు సూచించిన మందులను సరైన సమయంలో వాడాలి. జ్వరం తగ్గగానే మందులు ఆపేయకూడదు. కోర్సు పూర్తిగా వాడకపోతే శరీరంలోని పరాన్నజీవులు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
 ఇట్టి కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న, ఎన్సిడి జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సీసీ వెంకటేష్, ఏఎస్ఓ తిరుమలేష్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, ఎం సి హెచ్ సూపర్వైజర్స్, సుబ్బలక్ష్మి, షేక్ మ్మ , అర్బన్ సెంటర్ సిబ్బంది, హనుమంతు నర్సింలు, హెల్త్ అసిస్టెంట్  కృష్ణ, Anms. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State