బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇన్చార్జి ఈవోగా పురందర కుమార్
జోగులాంబ గద్వాల 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల. జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామస్వామి దేవాలయం మొదటి శ్రేణి కార్యనిర్వహణాధికారి పురంధర్ కుమార్ కు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇన్చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు.